Ramayanam Certification Course

Basic Level course in telugu

శీలనిర్మాణానికి రామాయణాన్ని మించిన పాఠం లేదు అని వివేకానంద స్వామి చెప్పారు. రామాయణాన్ని ఎంత అధ్యయనం చేస్తే అంత మంచిది.అందులో మొదటి మెట్టుగా మన సమితి రామాయణం మీద ఒక ప్రాథమిక పాఠ్యక్రమం (కోర్సు) ప్రారంభిస్తోందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ఇందులో ప్రత్యక్షంగా కానీ, ఆన్లైన్లో కానీ చేరవచ్చు.
ఈ పాఠ్యక్రమానికి రాష్ట్ర పాఠ్యప్రణాళికలో 10వ తరగతి ఉపవాచకంగా ఇచ్చిన రామాయణం కథ ప్రాతిపదిక.
ఇందులో ఉత్తీర్ణులయినవారికి ఉత్తీర్ణతాపత్రం ప్రదానం చేయబడుతుంది.పాఠ్యక్రమంలో చేరే విధానం తరువాతి పుటలో పొందుపరచబడింది. మా వెబ్సైటును సందర్శించి కూడా మీరు నమోదు కావచ్చు.

అర్హత: ఎవరైనా – గరిష్ఠ వయోపరిమితి 40 సంవత్సరాలు.
పరీక్ష: మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ/వీడియోకాల్)
అభ్యర్థుల నమోదు : సమితి వెబ్సైట్లో ఉన్న గూగుల్ ఫార్మ్ నింపి మీ అభ్యర్థిత్వాన్ని నమోదు చేసుకోవచ్చు.
పాఠ్యప్రణాళిక: 10వ తరగతి ఉపవాచకంగా ఇచ్చిన పుస్తకాన్ని చదవడం ద్వారా గానీ, లేకపోతే – ఇదే పాఠ్యాంశాన్ని ఆధారం చేసుకుని తయారుచేసిన వీడియోలు సమితి యూట్యూబ్ ఛానల్లో రామాయణం ప్లేలిస్టుగా ఉంచబడ్డాయి – వాటిని చూడడం ద్వారా గానీ అభ్యర్థులు పరీక్షకు సన్నద్ధమవ్వాలి. (దాని లింకు క్రింద ఇచ్చాము.)

పాఠ్యక్రమ (కోర్సు) ప్రణాళిక: సంవత్సరానికి రెండు విడతలుగా పాఠ్యక్రమం జరుగుతుంది.
మొదటి విడత: ఏప్రిల్ 1 నుంచి మే 30 వరకు
అభ్యర్థులు ఈ క్రింద ఇచ్చిన ప్రణాళికతో అధ్యయనం పూర్తిచేసి పరీక్షకు హాజరవ్వాలి.
ఏప్రిల్ మొదటిపక్షం: బాలకాండ, అయోధ్య కాండ
ఏప్రిల్ రెండవపక్షం: అరణ్యకాండ, కిష్కింధకాండ
మే మొదటిపక్షం: సుందరాకాండ
మే రెండవపక్షం: యుద్ధకాండ

నాలుగు ఆదివారాలు చర్చాతరగతులు నిర్వహించబడతాయి.
పరీక్ష మౌఖిక పరీక్ష (ప్రత్యక్ష లేదా ఆన్లైన్): జూన్ 1 నుంచి10 లోపల పూర్తిచేయాలి.
Certificate Distribution: 21 June (Yoga Day)

రెండవ విడత : అక్టోబరు 15 నుంచి డిసెంబరు 15 వరకు
అభ్యర్థులు ఈ క్రింద ఇచ్చిన ప్రణాళికతో అధ్యయనం పూర్తిచేసి పరీక్షకు హాజరవ్వాలి.
అక్టోబరు రెండవపక్షం: బాలకాండ అయోధ్య కాండ
నవంబరు మొదటిపక్షం: అరణ్యకాండ కిష్కింధకాండ
నవంబరు రెండవపక్షం: సుందరాకాండ
డిసెంబరు మొదటిపక్షం: యుద్ధకాండ

నాలుగు ఆదివారాలు చర్చాతరగతులు నిర్వహించబడతాయి.
పరీక్ష మౌఖిక పరీక్ష (ప్రత్యక్ష లేదా ఆన్లైన్): డిసెంబరు 20 నుంచి జనవరి 5 లోపల పూర్తిచేయాలి.
Certificate Distribution on 12 January (Youth Day)